Palms Sweating Problem: అరచేతుల్లో చెమటలు పడుతున్నాయా.. ప్రమాదకర వ్యాధి కావచ్చు జాగ్రత్త..!
Palms Sweating Problem: కొంతమందికి తరచుగా అరచేత్తుల్లో చెమలు వస్తుంటాయి.
Palms Sweating Problem: కొంతమందికి తరచుగా అరచేత్తుల్లో చెమలు వస్తుంటాయి. చేతులు మొత్తం తడిగా మారుతుంటాయి. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ లక్షణం లివర్ ఫెయిల్యూర్‌కి సంబంధించినది.ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను సులభంగా నయం చేయవచ్చు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
అరచేతుల్లో చెమటలు పట్టడం ఫ్యాటీ లివర్‌కి సంకేతం కానీ ఇది అన్ని సందర్భాల్లోనూ వర్తించదు. మనుషులను బట్టి మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో అరచేతులపై చెమట ఎక్కువగా సేబాషియస్ గ్రంధుల వల్ల కలుగుతుంది. దీని కారణంగా వ్యక్తి చర్మం చాలా జిడ్డుగా మారుతుంది. ఈ పరిస్థితిలో చికిత్స అవసరం. సేబాషియస్ గ్రంథులను నియంత్రించేందుకు వైద్యులు మందులు ఇస్తారు.
ఫ్యాటీ లివర్ సమస్య
ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది సాధారణ వ్యాధిగా మారుతోంది. చాలామంది చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఫ్యాటీ లివర్ అనేది మొదట్లో ఒక సాధారణ సమస్య తర్వాత అది లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం తాగనివారు కూడా ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఊబకాయం. బరువు పెరిగే వారిలో ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లు గుర్తించారు.
ఎలా రక్షించాలి
డైట్ ను కంట్రోల్ చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీని కోసం ఆహారంలో ఉప్పు, కారం తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అజీర్ణం, కడుపులో అధిక గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే సంప్రదించండం ఉత్తమం.