Health Tips: కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Health Tips: వాతావరణం మారుతున్న కొద్దీ శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి.
Health Tips: వాతావరణం మారుతున్న కొద్దీ శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో కళ్లపై చెడు ప్రభావం ఉంటుంది. చలికాలం గడిచేకొద్దీ పొడి గాలులు వీస్తాయి. దీని కారణంగా కళ్లలో మంట, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజుల్లో పొడి కళ్ళు సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్యలని నివారించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
కళ్లలో దురద లేదా మంట ఉంటే వాటిని తాకకూడదు. తాత్కాలిక ఉపశమనం కారణంగా ఇన్ఫెక్షన్ సంభవించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కళ్లలో మంటలు ఉన్నట్లయితే వాటిని తాకకుండా ఉండాలి. దీనికి బదులుగా కళ్లని చల్లని నీటితో కడిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో చాలా మంది రూం హీటర్లను ఉపయోగిస్తారు. చలిని తరిమికొట్టడం మంచిది కానీ అవి కళ్ళకు హానికరం. హీటర్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్లు పొడిబారడం సమస్య వస్తుంది.
శరీరంలో నీరు లేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం జరుగుతుంది. చలికాలంలో ప్రజలు తక్కువ నీటిని తాగుతారు. దీని కారణంగా కళ్ళు దెబ్బతింటాయి. కళ్ళు పొడిబారడం సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల పొడి కళ్ళు నివారించాలంటే పుష్కలంగా నీరు త్రాగాలి. కళ్ళు మండుతున్నట్లయితే రోజ్ వాటర్ లేదా ఐడ్రాప్స్ వేసుకోవాలి. దీంతో కళ్లు శుభ్రం అవుతాయి. దురద, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. చుక్కలు వేయడం ద్వారా కళ్ల పొడిబారకుండా ఉంటుంది.