Smartphone Side Effects: స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్నారా.. మెదడుపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే..?

Smartphone Side Effects: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇది లేనిదే దాదాపు ఎవరూ ఇంట్లో నుంచి కాలు బయటపెట్టరూ.

Update: 2024-01-09 14:30 GMT

Smartphone Side Effects: స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడుతున్నారా.. మెదడుపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే..?

Smartphone Side Effects: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇది లేనిదే దాదాపు ఎవరూ ఇంట్లో నుంచి కాలు బయటపెట్టరూ. అందుకే దీనిని స్మార్ట్‌ఫోన్‌ యుగంగా పిలుస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా విధాలుగా ఇది మన జీవితాలను సులభతరం చేస్తుంది. అయితే అన్ని విషయాల మాదిరే దీనివల్ల కూడా కొన్ని నెగిటివ్‌ విషయాలు ఉన్నాయి. ఇది మానవ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈరోజు తెలుసుకుందాం.

నష్టం ఏమిటి?

సాధారణంగా ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను రోజుకు 58 సార్లు చూస్తాడని ఒక పరిశోధనలో తేలింది. సగటున ఒక వ్యక్తి స్క్రీన్ సమయం రోజుకు 7 గంటలు. మొబైల్‌ని ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి హానికరం అని చాలా మందికి తెలుసు. కానీ అది శరీరానికి ఎంత ప్రమాదకరమో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. తలనొప్పి వస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియలో ఆటంకం కలుగుతుంది.

డోపమైన్ హార్మోన్

మొబైల్ కొందరి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. వారు ఉదయం మొదట తమ మొబైల్‌ను చూడకుండా ఉండలేరు. ఏదైనా మెసేజ్ వచ్చిందా, ఏదైనా సోషల్ మీడియా నుంచి నోటిఫికేషన్ వచ్చిందా, నా పోస్ట్‌ను ఎవరైన లైక్ చేసారా?, ఎవరు కామెంట్ చేశారు? తదితర వివరాలను ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటారు. దీనికోసం మెదడు మళ్లీ మళ్లీ మొబైల్‌ను తాకడానికి సిగ్నల్స్ ఇస్తుంది. నిజానికి ఇవన్నీ చేయడం వల్ల మెదడులో రసాయన చర్య జరిగి డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. మనం ఏదైనా పని చేయడంలో ఆనందంగా ఉన్నప్పుడు డోపమైన్ విడుదల అవుతుంది. దానివల్ల ఆ పని చేయాలనే కోరిక ఎక్కువై క్రమంగా అది వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం దీర్ఘకాలిక ఒత్తిడిగా మారుతుంది.

Tags:    

Similar News