Health Tips: ఛాతిలో శ్లేష్మం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: ఛాతిలో శ్లేష్మం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: చలికాలంలో జలుబు, దగ్గు, గొంతులో నొప్పి సర్వసాధారణం. కానీ కొంతమంది వ్యక్తులకి ఛాతిలో కఫం లేదా శ్లేష్మం పేరుకుపోతుంది. ఇది ఊపిరితిత్తులలో ఉత్పత్తి అయ్యే ఒక పదార్థం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి శ్లేష్మం అవసరం. ఎందుకంటే శ్లేష్మం మన ఊపిరితిత్తులలో ధూళి కణాలను చేరకుండా అడ్డుకుంటుంది. బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. కానీ ఈ శ్లేష్మం ఎక్కువైతే అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల దగ్గు, జలుబు, గొంతులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో కొన్ని చిట్కాలని పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
అల్లం
అల్లం ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది గొంతు, ఛాతీలో పేరుకుపోయిన అదనపు శ్లేష్మాన్ని సులభంగా వదిలిస్తుంది. అందువల్ల ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం వల్ల ఇబ్బంది పడుతుంటే అల్లం తింటే సరిపోతుంది.
ఉల్లిపాయ
మీరు ఛాతీలో శ్లేష్మం తొలగించడానికి ఉల్లిపాయను కూడా ఉపయోగించవచ్చు. జ్వరం, గొంతు నొప్పికి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం వల్ల ఇబ్బంది పడుతుంటే ఉల్లిపాయను బాగా తరిమి 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని రోజూ 3 స్పూన్లు తాగడం వల్ల ఛాతీలోని శ్లేష్మం తొలగిపోతుంది.