Protein Powder Side Effects: ఉదయమే ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా గమనించారా..!
Protein Powder Side Effects: ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం మార్కెట్‌లో లభించే ఎన్నో రకాల ఫుడ్ ప్రొడక్ట్స్‌ను వాడుతున్నారు.
Protein Powder Side Effects: ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం మార్కెట్‌లో లభించే ఎన్నో రకాల ఫుడ్ ప్రొడక్ట్స్‌ను వాడుతున్నారు. వాటిలో ప్రొటీన్ పౌడర్‌ను అధికమంది కొనుగోలు చేస్తున్నారు. ఉదయమే ప్రొటీన్ పౌడర్ కలిపిన పానీయాన్ని తాగి రోజును ప్రారంభిస్తున్నారు. ఇది ఒక మంచి అలవాటే కానీ ప్రొటీన్ పౌడర్ మంచిదా కాదా అని తెలుసుకోవడం అవసరం. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో ఏవి మంచివో, ఏవి కల్తీవో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొటీన్ పౌడర్ వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.
చిన్నపిల్లల ఎదుగుదల కోసం చాలామంది తల్లిదండ్రులు ప్రొటీన్ పౌడర్‌ను తినిపిస్తుంటారు. అలాగే పెద్దలు, యువతీ యువకులు, అథ్లెట్స్ బాడీ ఫిట్‌నెస్ కోసం వీటిని తీసుకుంటారు. అయితే 70 శాతం ప్రోటీన్ పౌడర్లలో పెస్టిసైడ్స్ ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 36 రకాల ప్రోటీన్ సప్లిమెంట్స్‌ను పరిశోధకులు పరీక్షించగా 70 శాతం వరకు విషపదార్థాలతో కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. అలాగే పలు బ్రాండ్లు, వాటి ఉత్పత్తులపై పేర్కొన్న విధంగా కాకుండా ప్రోటీన్ కంటెంట్‌లో సగం మాత్రమే అందిస్తున్నట్లు తేల్చారు.
మరికొన్నింటిలో నాణ్యతలేని ప్రోటీన్లను, అలాగే 14 శాతం నమూనాలలో ఆరోగ్యానికి హాని చేయగల ఫంగల్ అఫ్లాటాక్సిన్స్, మరో ఎనిమిది శాతం ప్రోటీన్ పౌడర్లలో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని రకాల బ్రాండ్లలో అయితే లెడ్ పర్సంటేజ్ 75 శాతం, ఆర్సెనిక్ 13 శాతం, కాడ్మియం 27.8 శాతం ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇవన్నీ మానవ ఆరోగ్యంపై హాని కరమైన ప్రభావాన్ని చూపుతాయని, హెపాటో టాక్సిసిటీ అనే లివర్ సంబంధిత వ్యాధికి కారణం అవుతాయని వెల్లడించారు. అంతేకాకుండా హానికరమైన విషపదార్థాలు కలిగి ఉండటంవల్ల అవి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, పిల్లల్లో ఎదుగుదలను అడ్డుకుంటాయని తేల్చారు.