Health Tips: ప్రొటీన్‌ లోపం ఇబ్బందిపెడుతుందా.. గుడ్లు మాత్రమే కాదు ఈ కూరగాయలు కూడా తినొచ్చు..!

Health Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అందాలి. శరీరాన్ని బలోపేతం చేయడంలో ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Update: 2023-11-25 16:00 GMT

Health Tips: ప్రొటీన్‌ లోపం ఇబ్బందిపెడుతుందా.. గుడ్లు మాత్రమే కాదు ఈ కూరగాయలు కూడా తినొచ్చు..!

Health Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన పోషకాలు అందాలి. శరీరాన్ని బలోపేతం చేయడంలో ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపం ఉంటే ఫిట్‌గా ఉండలేరు. ప్రొటీన్‌ కోసం చాలామంది గుడ్లు తింటారు. కానీ కొంతమంది వెజిటేరియన్స్‌ ఉంటారు. వారు గుడ్లు తినలేరు. వీరు కూరగాయల ద్వారా ప్రొటీన్‌ పొందవచ్చు. అలాంటి కూరగాయల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బీన్స్

శాకాహారులు గుడ్లు తినలేరు. ఈ పరిస్థితిలో చింతించాల్సిన అవసరం లేదు. కేవలం బీన్స్ తింటే సరిపోతుంది. చాలా మందికి నాన్ వెజ్ ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ బీన్స్ తినవచ్చు. ఆహారంలో బీన్స్, పప్పులు చేర్చుకోవాలి. ఇందులో బఠానీ చాలా ముఖ్యమైనది. ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. ఇది మీ శరీరాన్ని బలపరుస్తుంది.

పెరుగు

శరీరం దృఢంగా ఉండాలంటే పెరుగును డైట్‌లో చేర్చుకోవాలి. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది.

పుట్టగొడుగులు

మష్రూమ్ ఒక వెజిటేబుల్ కూరగాయగా పరిగణిస్తారు. ఇందులో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. మష్రూమ్‌ కూర తినడం వల్ల ప్రోటీన్ లోపం తొలగిపోతుంది. అందువల్ల రోజూ పుట్టగొడుగులను తీసుకోవాలి.

అవోకాడో

శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే అవకాడోలను తినాలి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇప్పటి నుంచే ఆవకాడోను తీసుకోవడం ప్రారంభించండి.

Tags:    

Similar News