Sore Throat Problem: తరచుగా గొంతు నొప్పి ఇబ్బందిపెడుతుందా.. ఈ ఆయుర్వేద పద్దతులతో నివారించండి..!

Sore Throat Problem: కొంతమందికి సీజన్‌ మారినప్పుడల్లా గొంతునొప్పి ఎదురవుతుంది.

Update: 2024-02-15 16:00 GMT

Sore Throat Problem: తరచుగా గొంతు నొప్పి ఇబ్బందిపెడుతుందా.. ఈ ఆయుర్వేద పద్దతులతో నివారించండి..!

Sore Throat Problem: కొంతమందికి సీజన్‌ మారినప్పుడల్లా గొంతునొప్పి ఎదురవుతుంది. మరికొంత మందికి ఏసీలో ఎక్కువ సమయం గడిపినప్పుడు లేదంటే చల్లటి గాలికి గురైనప్పుడు గొంతునొప్పి వస్తుంది. మరికొందరికి జలుబు, దగ్గు సమస్యలు వచ్చినప్పుడు గొంతునొప్పి ఏర్పడుతుంది. ఈ మూడు సందర్భాలలో ఏర్పడిన గొంతునొప్పిని కొన్ని ఆయుర్వేద పద్దతుల ద్వారా తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. ఉప్పు నీటితో పుక్కిలించు

ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కొంచెం నీటిని వేడిచేసి ఒక గ్లాసులో పోయాలి. అందులో టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక సిప్ ఉప్పునీరు తీసుకుంటూ 10 సెకన్ల పాటు పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తే గొంతునొప్పి తగ్గుతుంది.

2. నల్ల మిరియాలు, తేనె

నల్లమిరియాలు, తేనె మిశ్రమం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక మంచి చిట్కా. ఇది గొంతు నొప్పి, జలుబు, దగ్గు తగ్గడానికి ఉపయోగిస్తారు. తేనెలో సహజమైన గుణాలు ఉంటాయి. ఇది దగ్గును అణిచివేస్తుంది. మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

3. అల్లం

అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇందులో శక్తివంతమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. 1 అంగుళం అల్లం బాగా తురిమి ఒక గిన్నెలో వేయాలి. అందులో 1 గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. సుమారు 5 నిమిషాలు తర్వాత అల్లం నీటిని వడకట్టి తాగాలి.

4. ఆపిల్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 1 గ్లాసు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. చల్లారాక పరగడుపున తాగాలి.

5. ములేతి

ములేతి అనేది యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న హెర్బల్ రెమెడీ. ఇది గొంతు నొప్పి మాత్రమే కాకుండా అజీర్ణం, మలబద్ధకం, కడుపు పూతలకి చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News