Health Tips: ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా.. ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిందే..!
Health Tips:ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో ఏసీ ఉంటుంది. ఎండవేడి నుంచి రక్షించడంలో ఎసీ ఎంతగానో సహకరిస్తుంది.
Health Tips: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో ఏసీ ఉంటుంది. ఎండవేడి నుంచి రక్షించడంలో ఎసీ ఎంతగానో సహకరిస్తుంది. కానీ కొంతమంది రోజు మొత్తం ఏసీలోనే గడుపుతారు. కొంత వేడి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చాలా బాధపడుతారు. అయితే రోజంతా ఏసీలో ఉండడం వల్ల అనేక శారీరక సమస్యలు ఎదరవుతాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్వాసకోశ సమస్యలు
ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. ముక్కు, గొంతు సమస్యలు సంభవిస్తాయి. ఎయిర్ కండిషనింగ్ పొడిగా ఉన్నందున గొంతులో పొడిగా ఉంటుంది. ఇది చాలా చికాకును కలిగిస్తుంది.
విపరీతమైన అలసట
ఎక్కువ సమయం ఏసీలో గడిపే వ్యక్తులు విపరీతమైన అలసట, బలహీనతను అనుభవిస్తారు. అంతేకాదు తరచుగా నీరసానికి గురవుతారు. దీన్ని నివారించడానికి ఏసీని తక్కువ చల్లదనంలో వాడుకుంటే మంచిది.
తలనొప్పి
ఏసీ కింద ఎక్కువ సమయం గడిపేవారికి తలనొప్పి సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే ఎయిర్ కండిషనింగ్ కారణంగా గది వాతావరణం పొడిగా మారుతుంది. దీంతో ప్రజలు డీహైడ్రేషన్‌కి గురై బయటికి వెళ్లినప్పుడు తలనొప్పి సమస్యని ఎదుర్కొంటారు.
పొడి చర్మం
ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మంపై చెడు ప్రభావం పడుతుంది. చర్మం పొడిగా, దురదగా మారుతుంది. చికాకుని కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.