Fruits for Breakfast: ఉదయం టిఫిన్ మానేసి ఫ్రూట్స్ తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

Health Tips: ఉదయం టిఫిన్ తినకపోవడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు అందవు.

Update: 2023-04-27 00:30 GMT

Health Tips: ఉదయం టిఫిన్ మానేసి ఫ్రూట్స్ తింటున్నారా..ఎంత ప్రమాదమో తెలుసా..

Health Tips: ఈ మధ్య ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. బరువు తగ్గాలని కొందరు, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఇంకొందరు ఇలా కారణాలు ఏమైనా..ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతూ జిమ్ బాట పడుతున్నారు. అలాగే ఆహార అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఉదయం పూట టిఫిన్ మానేసి..పండ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఇది చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం టిఫిన్ మానేసి ఆ స్థానంలో ఫ్రూట్స్ ని రీప్లేస్ చేస్తే హెల్త్ త్వరగా దెబ్బ తింటుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటి పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి కదా..మరి ఆరోగ్యం ఎందుకు దెబ్బ తింటుందని మీకు సందేహాలు కలుగుతున్నాయి కదా..ఫ్రూట్స్ ద్వారా మనకు పోషకాలు లభిస్తాయి ఇందులో డౌట్ అక్కర్లేదు కానీ బ్యాలెన్డ్స్ డైట్ మాత్రం మనకు లభించదు. ఉదయం సరైన టిఫిన్ తింటే మనకు పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ అందుతాయి.

ఉదయం లేచిన తర్వాత పరగడుపున ఫ్రూట్స్ ను అల్పాహారంగా తీసుకుంటే యసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు పండ్లు మాత్రమే తింటే బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కేవలం ఫూట్స్ తింటే మలబద్ధకం సమస్య కూడా తలెత్తవచ్చు. కాబట్టి మన శరీరానికి పూర్తి శక్తి అందాలంటే ఉదయం పూట అల్పాహారం తినడం చాలా ఉత్తమం. రోజులో చేసే మొదటి భోజనమే మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. మొత్తంగా, ఉదయం పూట అల్పాహారం కచ్చితంగా తినాలి. దాన్ని స్కిప్ చేసి ఏది తిన్నా ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

Tags:    

Similar News