Health Tips: ముఖాన్ని టవల్‌తో పదే పదే శుభ్రం చేస్తున్నారా.. ఈ అలవాటు మంచిది కాదు..!
Health Tips: చాలామంది బయటి నుంచి ఇంటికి వచ్చి ముఖం కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటారు.
Health Tips: చాలామంది బయటి నుంచి ఇంటికి వచ్చి ముఖం కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటారు. సహజంగా ఇది అన్ని ఇళ్లలో జరిగే ప్రక్రియే. అయితే ఈ అలవాటు మనల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. వాస్తవానికి కుటుంబ సభ్యులందరూ ఒకే టవల్‌తో ముఖాన్ని తుడుచుకున్నప్పుడు అది మురికిగా మారుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది. టవల్‌ను పదే పదే వాడటం వల్ల కలిగే చర్మ వ్యాధుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. ముఖంపై ముడతలు
ముఖం కడుక్కున్న తర్వాత టవల్ తో ముఖాన్ని గట్టిగా తుడుచుకోవద్దు. ఇలా చేయడం వల్ల ముఖం ఫ్లెక్సిబిలిటీ, గ్లో దెబ్బతింటుంది. దీని కారణంగా ముందుగానే ముఖంపై ముడతలు వస్తాయి. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.
2. మొటిమల ప్రమాదం
ఇళ్లలో ఉపయోగించే టవల్స్ సాధారణంగా రోజూ ఉతకరు. దీని కారణంగా అనేక బాక్టీరియా, క్రిములు అందులో నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. మీరు ఆ టవల్‌ని ఉపయోగించినప్పుడు ఆ బ్యాక్టీరియా ముఖంపై దాడి చేస్తుంది. దీని వల్ల మొటిమలు వస్తాయి. అందుకే రోజూ టవల్స్‌ను ఎండలో కాసేపు ఆరబెట్టడం మంచిది.
3. సహజ తేమ చెడిపోతుంది
మనందరి ముఖంలో సహజ తేమ ఉంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల వల్ల ఈ తేమ ఉత్పత్తి అవుతుంది. టవల్‌తో గట్టిగా రుద్దుతూ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఆ సహజ తేమ పోతుంది. అందుకే ముఖం కడుక్కున్న తర్వాత ఎప్పుడూ టవల్‌తో ఎక్కువగా రుద్దకూడదు.
4. ముఖాన్ని ఆరనిచ్చే పద్దతి
ముఖం కడిగిన తర్వాత తుడుచుకోవడానికి మృదువైన టవల్ ఉపయోగించండి. ఇది శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి. లేదంటే ముఖం కడిగిన తర్వాత అలాగే వదిలేయండి. కొన్ని నిమిషాలకి అదే ఆరిపోతుంది. దీనివల్ల వల్ల ముఖంలో మెరుపు అలాగే ఉంటుంది.