Health Tips: పదే పదే దాహం వేస్తోందా.. జాగ్రత్త ఈ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది..!

Health Tips: కొన్నిసార్లు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు.

Update: 2023-02-07 05:30 GMT

Health Tips: పదే పదే దాహం వేస్తోందా.. జాగ్రత్త ఈ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది..!

Health Tips: కొన్నిసార్లు ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. చాలా సార్లు అతిదాహం వల్ల నిద్రభంగం జరుగుతుంది. అయితే పదే పదే దాహం వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రమాదకరమైన వ్యాధులబారిన పడకుండా ఉండవచ్చు. కాబట్టి తరచుగా దాహం వెనుక ఉండే కారణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మధుమేహం

రక్తంలో చక్కెర పరిమాణం పెరిగితే శరీరం పెరిగిన చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గి మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.

రక్తపోటు

మీకు రక్తపోటు పెరిగినట్లయితే చెమటలు విపరీతంగా వస్తాయి. ఇది డీ హైడ్రేషన్‌కి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. అధిక రక్తపోటు సమస్య చెడు జీవనశైలికి సూచన. ఈ పరిస్థితిలో అధిక రక్తపోటుతో పాటు, శరీరంలో నీటి కొరత కూడా ఉంటుంది.

డీ హైడ్రేషన్‌

డీహైడ్రేషన్ అనేది శరీరంలో నీటి కొరతను సూచించే సమస్య. నీరు తక్కువగా తాగడం లేదా అస్సలే తాగకపోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. డీహైడ్రేషన్‌ అధిగమించడానికి పండ్ల రసాలు, కొబ్బరి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News