Health Tips: ఈ జంక్‌ ఫుడ్స్ పిల్లలకు తినిపిస్తున్నారా.. లోపలి నుంచి దెబ్బతీస్తాయి జాగ్రత్త..!

Health Tips: నేటి కాలంలో పిల్లల ఆహారం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం లేదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోకుండా ఇష్టమొచ్చినవి పెడుతున్నారు.

Update: 2024-03-19 10:30 GMT

Health Tips: ఈ జంక్‌ ఫుడ్స్ పిల్లలకు తినిపిస్తున్నారా.. లోపలి నుంచి దెబ్బతీస్తాయి జాగ్రత్త..!

Health Tips: నేటి కాలంలో పిల్లల ఆహారం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం లేదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోకుండా ఇష్టమొచ్చినవి పెడుతున్నారు. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ తినిపించడం స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తున్నారు. ఇవి పిల్లలను లోపలి నుంచి దెబ్బతీస్తున్నాయి. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి భవిష్యత్‌లో పెద్ద వ్యాధులకు గురికావాల్సి ఉంటుంది. అలాంటి జంక్‌ఫుడ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ముఖ్యంగా పిల్లలకు కుకీలు ఇవ్వకండి. ఇవి అనారోగ్య కొవ్వులతో నిండి ఉంటాయి. వీటిలో పోషకాలు ఏమి ఉండవు. పిల్లలను శక్తివంతం చేయడానికి తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు, పిజ్జాలో సంతృప్త కొవ్వు, సోడియం, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. క్యాండీ, చాక్లెట్, ఇతర స్వీట్లు కేలరీలకు ప్రధాన మూలం. ఇవి బరువు పెరుగుట, దంత సమస్యలను పెంచుతాయి. సోడా, ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి అధిక కేలరీల పానీయాలు. ఇవి బరువు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి.

చిప్స్ రుచికరమైనవి అయినప్పటికీ అవి క్యాన్సర్‌కు కారణమయ్యే యాక్రిలామైడ్ వంటి హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి. పిల్లలు తక్షణ నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ జంక్ ఫుడ్స్‌లో సోడియం మాత్రమే ఉంటుంది. రుచి కోసం రసాయనాలు కలుపుతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.

Tags:    

Similar News