Ramadan 2023: రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. షుగర్‌ పేషెంట్లకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Ramadan 2023: రంజాన్ నెల ముస్లింలకు చాలా పవిత్రమైనది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసం ఉంటారు.

Update: 2023-03-22 13:30 GMT

Ramadan 2023: రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉంటున్నారా.. షుగర్‌ పేషెంట్లకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Ramadan 2023: రంజాన్ నెల ముస్లింలకు చాలా పవిత్రమైనది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసం ఉంటారు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమి తినకుండా ఉంటారు. తరువాత ఇఫ్తార్‌ ద్వారా ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే మధుమేహంతో బాధపడేవారు రంజాన్‌ మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పద్దతి ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటెన్‌ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించాలి. షుగర్‌ పేషెంట్లు ఉపవాసం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

మంచి నిద్ర

మంచి ఆరోగ్యం కోసం మంచి నిద్ర అవసరం. షుగర్‌ పేషెంట్లు రంజాన్ సందర్భంగా శక్తిని కాపాడుకోవడానికి ఉదయం భోజనం ముఖ్యం. అలాగే తగినంత నిద్ర పొందడం కూడా ముఖ్యమే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.

శక్తిని పెంచే ఆహారాలు

ఈ మాసంలో ఎక్కువ ఫైబర్-రిచ్ ఫుడ్‌లను తీసుకోవాలి. ఇది క్రమంగా శరీరానికి శక్తిని అందిస్తుంది. ఓట్స్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ నుంచి బాస్మతి రైస్, కూరగాయలు, పప్పులు మొదలైన వాటిని ఉదయం భోజనంలో తీసుకోవచ్చు. బలం కోసం చేపలు, టోఫు, నట్స్ వంటి ప్రోటీన్లను తినవచ్చు. పుష్కలంగా ద్రవ పానీయాలు తాగాలి. కానీ కాఫీ, శీతల పానీయాలు, చక్కెర లేదా కెఫిన్ అధికంగా ఉండే పానీయాలకి దూరంగా ఉండాలి

ఇఫ్తార్ సమయంలో

ఉపవాసం సంప్రదాయకంగా ఖర్జూరం, పాలతో విరమిస్తారు. మీరు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే పదార్థాలతో ఉపవాసం ముగించవచ్చు. తీపి, నూనె పదార్థాలను మితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నిద్రపోయే ముందు పండ్లు తీసుకుంటే ఉత్తమం.

Tags:    

Similar News