Exercise: మీరు వ్యాయామం చేస్తున్నారా.. లేదంటే ఈ వ్యాధులు మీ వెంటే..!

Exercise: మద్యం సేవించడం, సిగరెట్ తాగడం ప్రాణాంతకమని అందరికి తెలుసు.

Update: 2022-04-22 11:30 GMT

Exercise: మీరు వ్యాయామం చేస్తున్నారా.. లేదంటే ఈ వ్యాధులు మీ వెంటే..!

Exercise: మద్యం సేవించడం, సిగరెట్ తాగడం ప్రాణాంతకమని అందరికి తెలుసు. కానీ రోజంతా కదలకపోవడం, మంచంపై పడుకోవడం, వ్యాయామం చేయకపోవడం కూడా అంతే ప్రమాదకరం. మీరు రోజంతా ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా లేదా నడవకపోయినా అకాల మరణం సంభవిస్తుంది. మీరు వ్యాయామం చేయకపోతే మంచి నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ఊబకాయం బారిన పడుతారు. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మూడ్ డిజార్డర్ కలిగి ఉంటారు.

వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం రక్త ప్రసరణను పెంచుతుంది. గుండె రక్తాన్ని పంప్ చేయడం సులభతరం చేస్తుంది. మీరు వ్యాయామం చేయకపోతే రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. కేవలం వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె జబ్బులు 6 శాతం పెరిగాయి. వ్యాయామం చేయకపోవడం వల్ల 7 శాతం మధుమేహ కేసులు పెరిగాయి. 10 శాతం పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు పెరిగాయి.

వ్యాయామం న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. కానీ వ్యాయామం చేయని వ్యక్తుల మెదడులో కొత్త న్యూరాన్లు త్వరగా అభివృద్ధి చెందవు. ది లాన్సెట్ జర్నల్‌లో జరిపిన పరిశోధనలో వ్యాయామం చేసేవారిలో పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. వారానికి 5 రోజులు 30 నిమిషాలు నడిస్తే మీరు ఫిట్‌గా ఉంటారు. అందుకే ప్రతిఒక్కరు వ్యాయామం చేయాలి.

Tags:    

Similar News