Health Tips: బంగాళదుంపలు ఎక్కువగా తింటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

Health Tips: బంగాళదుంపలతో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. బర్గర్‌ నుంచి చిప్స్ వరకు చాలా రకాల ఫాస్ట్ ఫుడ్‌లలో ఉపయోగిస్తారు.

Update: 2023-12-06 15:30 GMT

Health Tips: బంగాళదుంపలు ఎక్కువగా తింటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

Health Tips: బంగాళదుంపలతో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. బర్గర్‌ నుంచి చిప్స్ వరకు చాలా రకాల ఫాస్ట్ ఫుడ్‌లలో ఉపయోగిస్తారు. ఇళ్లలో మహిళలు కూడా బంగాళదుంపల కూర వండుతారు. ఇలా ప్రతిచోట మీకు తెలియకుండానే బంగాళదుంపలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే బంగాళదుంపలు ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల అనేక రోగాలు వస్తాయి. వీటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.

బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగితే కొవ్వు కూడా పెరుగుతుంది. దీని వల్ల మనిషి ఊబకాయానికి గురవుతాడు. ప్రాసెస్ చేసిన బంగాళదుంపలు సాధారణ బంగాళదుంపల కంటే చాలా ప్రమాదకరమైనవి. వీటితో చిప్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌ తయారుచేస్తారు. ఈరోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తినే ట్రెండ్ ప్రజల్లో బాగా పెరిగిపోయింది. పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. పిల్లల్లో ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణం ఇదే. ఇది అనేక వ్యాధులకు దారితీస్తోంది.

మధుమేహం ప్రమాదం

డయాబెటిక్ రోగులకు బంగాళదుంపలు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటి అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది డయాబెటిక్ రోగుల సమస్యలను పెంచుతుంది. అందుకే డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటే మంచిది.

ఒక వ్యక్తి ఎంత మొత్తంలో బంగాళాదుంపలు తినాలి?

ఎలాంటి వ్యాధి లేని వ్యక్తి వారంలో రెండు రోజులు బంగాళదుంపలు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారు మూడు రోజులు బంగాళదుంపలు తినవచ్చు. అయితే ఉడికించిన బంగాళదుంపలు తినడానికి ప్రయత్నించాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పరిమిత పరిమాణంలో బంగాళదుంపలను తింటే శరీరంలో స్టార్చ్ పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తరచుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే బంగాళాదుంపలను తినడం మానుకోండి. ఇది సమస్యను మరింత పెంచుతుంది.

Tags:    

Similar News