Health Tips: టీతో పాటు రస్క్ తింటున్నారా.. ఆరోగ్యానికి పెద్ద నష్టం..!
Health Tips: నగరాల్లోని చాలా మంది ప్రజలు ఉదయం పరగడుపున టీతో రస్క్ తినడానికి ఇష్టపడతారు.
Health Tips: నగరాల్లోని చాలా మంది ప్రజలు ఉదయం పరగడుపున టీతో రస్క్ తినడానికి ఇష్టపడతారు. ఇది చాలామందికి అలవాటు కూడా. అంతేకాదు రోజులో చాలాసార్లు ఇలాగే తింటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. వాస్తవానికి రస్క్‌ని సరైన పద్దతిలో తయారుచేయరు. రస్క్‌ని టీతో కలిపి తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
రస్క్‌లో ఉండే పదార్థాలు
రస్క్ తయారుచేయడానికి రిఫైన్డ్ గోధుమ పిండిని ఉపయోగిస్తారు. దీంతో పాటు రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫుడ్ ఎడిటివ్‌లు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల తొందరగా స్థూలకాయులుగా మారుతారు.
టీతో రస్క్ తింటే కలిగే నష్టాలు
టీతో రస్క్ తినడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది అన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
పేగులను దెబ్బతీస్తుంది
మీరు రెగ్యులర్‌గా టీతో రస్క్ తీసుకుంటే పేగులకి పొక్కుల సమస్యని కలిగిస్తాయి. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపులో ఇతర సమస్యలను కలిగిస్తుంది.