Health Tips: నిద్రపోయే ముందు వాటర్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
Health Tips: మన బాడీలో 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. శరీరంలో జరిగే ప్రతి పనికి నీరు అవసరం ఉంటుంది.
Health Tips: మన బాడీలో 70 శాతం నీరు మాత్రమే ఉంటుంది. శరీరంలో జరిగే ప్రతి పనికి నీరు అవసరం ఉంటుంది. ఆహారం తీసుకోకుండా నీరు తాగుతూ ఒక వ్యక్తి వారం రోజులపాటు బతకవచ్చు. అయితే నీరు తాగే పద్దతులు, నియమాలు చాలా మందికి తెలియవు. ఇష్టమొచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ తాగేస్తుంటారు. కొంతమంది రాత్రిపూట పడుకునే ముందు బాటిల్ ఖాళీ చేసి పడుకుంటారు. కానీ ఇది చాలా రకాల హానిని కలిగిస్తుంది. నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.
1. నిద్ర భంగం
మీరు రాత్రిపూట ఎక్కువ నీరు తాగితే తరచుగా నిద్ర నుంచి మేల్కొంటారు. ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా నిద్ర విధానం చెడిపోతుంది. వాస్తవానికి ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర అవసరం. కాబట్టి నిద్రభంగం చేయవద్దు. లేదంటే మరుసటి రోజు మీరు అలసట, బద్ధకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
2. కడుపులో భారం
మీరు నిద్రపోయే ముందు ఎక్కువ నీరు తాగితే అది పొట్టలో నీటి శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల కడుపు నిండుగా ఉంటుంది. మీరు మంచం మీద కదలడానికి, తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది చివరికి మీ నిద్రకు భంగం కలిగిస్తుంది.
3. మూత్రపిండాలపై ప్రభావం
పగలు రాత్రి అనే తేడా లేకుండా నీరు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలకు మంచిది కాదు. నిజానికి పరిమితికి మించి నీరు తాగితే కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడి అవి అనారోగ్యానికి గురవుతాయి. తరచూ కడ్నీ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. దీంతో హాస్పిటల్ వెళ్లి అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.