Warm Water Side Effects: ఉదయం నిద్ర లేవగానే హాట్‌ వాటర్‌ తాగుతున్నారా.. ఈ ప్రతికూలతలు తెలుసుకోండి..!

Warm Water Side Effects: కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగుతారు.

Update: 2024-03-12 02:30 GMT

Warm Water Side Effects: ఉదయం నిద్ర లేవగానే హాట్‌ వాటర్‌ తాగుతున్నారా.. ఈ ప్రతికూలతలు తెలుసుకోండి..!

Warm Water Side Effects: కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగుతారు. దీనివల్ల పొట్ట క్లీన్‌ అవుతుందని అనుకుంటారు. చాలా మంది ఫిట్‌నెస్ కోచ్‌లు,సెలబ్రిటీలు కూడా ఈ అలవాటుతో రోజును ప్రారంభిస్తారు. దీనివల్ల ప్రయోజనాలతో పాటు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఈ రెండింటి గురించి క్లారిటీ లేని వ్యక్తులు అయోమయంలో ఉన్నారు. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ రోజు తెలుసుకుందాం.

నీరు తాగడానికి మార్గం

చాలా సార్లు బరువు తగ్గడానికి లేదా చర్మం మెరిసేలా చేయడానికి నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకునే వారు కొందరు ఉంటారు. వారు రోజంతా ఈ దినచర్యను కొనసాగిస్తారు. అయితే ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదు. దాహం వేసినప్పుడే మాత్రమే నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీరు తాగిన వెంటనే ఘన పదార్థాలు తినవద్దు.

నిపుణుల మాటలు

మీరు రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తే ఆరోగ్యానికి మంచిదే. అయితే కొన్ని నియమాలను పాటించడం కూడా ముఖ్యం. పళ్లు తోముకున్న తర్వాత మాత్రమే ఎప్పుడు నీరు తాగాలి. ఉదయం అల్పాహారంతో పాటు కొంచెం గోరువెచ్చని నీటిని తాగవచ్చు. అయితే, 100ml కంటే ఎక్కువ నీరు తాగకూడదని గుర్తుంచుకోండి.

ఈ విషయాల పట్ల జాగ్రత్త

చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే 1 లేదా 2 గ్లాసుల నీరు తాగుతారు. ఇలా చేయడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుందని నమ్ముతారు. కానీ రాత్రిపూట మీ నోటిలో అనేక రకాల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఉదయాన్నే నోటిని శుభ్రం చేయకుండా నీరు తాగితే అదే బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడూ పళ్లు తోముకున్న తర్వాతే గోరువెచ్చని నీటిని తాగాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News