Toothpaste: టేస్ట్‌ చూసి టూత్‌పేస్ట్‌ కొంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే..!

Toothpaste: పండ్లు తోమడానికి అందరు టూత్‌పేస్టుని వాడుతారు. కానీ ఇందులో ఎవరికి నచ్చిన టూత్‌పేస్ట్‌ వారికి ఉంటుంది.

Update: 2023-02-11 01:30 GMT

Toothpaste: టేస్ట్‌ చూసి టూత్‌పేస్ట్‌ కొంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే..!

Toothpaste: పండ్లు తోమడానికి అందరు టూత్‌పేస్టుని వాడుతారు. కానీ ఇందులో ఎవరికి నచ్చిన టూత్‌పేస్ట్‌ వారికి ఉంటుంది. అయితే కొంతమంది తియ్యని టూత్‌పేస్ట్‌ వాడితే మరికొంతమంది ఘాటు టూత్‌పేస్ట్‌ని వాడుతారు. పెద్ద పెద్ద టూత్‌పేస్ట్ కంపెనీలన్నీ తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి మార్కెటింగ్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో సరైన టూత్‌పేస్ట్ ఏదో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. నిజానికి టూత్‌పేస్ట్‌ ఎంపిక ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం టూత్‌పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్, రుచికి బదులుగా అందులో ఉండే ముఖ్య పదార్ధమైన ఫ్లోరైడ్‌ను తనిఖీ చేయాలి. ప్రజలు ఎల్లప్పుడూ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి. దీనికి కారణం ఫ్లోరైడ్ అనేది దంతాల లోపల, వెలుపల పేరుకుపోయిన మురికిని శుభ్రంచేస్తుంది. దీని వల్ల దంతాలు మెరుస్తూ శుభ్రంగా ఉంటాయి.

పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్

పిల్లల దంతాలు సున్నితంగా ఉంటాయి కాబట్టి ఫ్లోరైడ్ తక్కువగా ఉండే టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. పెద్దలు ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. సాధారణంగా 1,350 నుంచి 1,500 ppm ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ పిల్లలకు 1000 పీపీఎం ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ సరిపోతుంది.

ఒకవేళ దంత క్షయం వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను వాడవచ్చు. అయితే దానికి కూడా ఒక పరిమితి ఉంటుందని గుర్తుంచుకోండి. దంతాలను టూత్‌పేస్ట్‌తో మాత్రమే శుభ్రం చేయాలి. అయితే ఇది సరైన నాణ్యతతో కూడా ఉండాలని మరిచిపోవద్దు. లేదంటే దంతక్షయాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది.

Tags:    

Similar News