Hair Care Tips: తలస్నానం చేసే ముందు జుట్టుకి ఇవి అప్లై చేస్తున్నారా..!

Hair Care Tips: మృదువైన మెరిసే జుట్టు కావాలని అందరికి ఉంటుంది. ఎందుకంటే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Update: 2023-05-27 03:30 GMT

Hair Care Tips: తలస్నానం చేసే ముందు జుట్టుకి ఇవి అప్లై చేస్తున్నారా..!

Hair Care Tips: మృదువైన మెరిసే జుట్టు కావాలని అందరికి ఉంటుంది. ఎందుకంటే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే జుట్టుని మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే కచ్చితంగా కొన్ని పద్దుతులు పాటించాలి. తలస్నానం చేసే ముందు కొన్నిటిని జుట్టుకు అప్లై చేయాలి. దీనివల్ల జుట్టును సులభంగా మృదువుగా మారుతుంది. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె

జుట్టు దృఢంగా, ఒత్తుగా ఉండాలంటే హెయిర్ ఆయిల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే జుట్టు పోషణకు నూనె రాసుకోవడం అవసరం. ఇందుకోసం గోరువెచ్చని కొబ్బరి నూనెను జుట్టుకు, తలకు పట్టించాలి. 10 నిమిషాల పాటు తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. గంట తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తేమగా మారుతుంది.

గుడ్డు

స్నానానికి ముందు గుడ్డును జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. గుడ్డులోని పసుపు భాగాన్ని తీసి తెల్లసొనని జుట్టుకి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు జుట్టులో ఉంచి ఆపై షాంపూతో కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది.

పెరుగు

పెరుగు వాడటం వల్ల జుట్టు పొడిబారడం తగ్గుతుంది. ఇది వెంట్రుకలను మృదువుగా, మెరిసేలా చేస్తుంది. తలస్నానానికి ముందు జుట్టుకు పెరుగును రాసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక గిన్నెలో తీసుకుని జుట్టుకు, తలకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకి మంచి షైనింగ్‌ వస్తుంది.

Tags:    

Similar News