Anti Aging Foods: వయసు కనబడకూడదంటే ఈ యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్ తినాల్సిందే..!

Anti Aging Foods: ముఖ చర్మం అందంగా కనిపించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Update: 2022-12-08 09:39 GMT

Anti Aging Foods: వయసు కనబడకూడదంటే ఈ యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్ తినాల్సిందే..!

Anti Aging Foods: ముఖ చర్మం అందంగా కనిపించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖంలో గ్లో మెయింటైన్ చేయడానికి చర్మం హైడ్రేట్ గా ఉండాలి. ముడతలు, పొడి చర్మం, పిగ్మెంటేషన్, మచ్చలు వంటి చర్మ సమస్యలు వయస్సు పెరిగే కొద్దీ కనిపిస్తాయి. వృద్ధాప్యం మొదటి ప్రభావం చర్మంపై మాత్రమే కనిపిస్తుంది. నిర్జీవంగా కనిపించే చర్మాన్ని సరైన ఆహారం ద్వారా పునరుజ్జీవింపజేయవచ్చు. కణాల పెరుగుదలను పెంచడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అలాంటి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ ఫుడ్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే చర్మం ఆకృతి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యం శారీరక ప్రభావాలను తగ్గిస్తాయి. రక్తం నుంచి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. అందులో ఒకటి ఆవకాడో. ఇందులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి అవసరమైన కొన్ని విటమిన్లు, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. ఈ పండు సహజ మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది.

బొప్పాయి

బొప్పాయిలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడానికి, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అనేక రకాల విటమిన్లు ఇందులో లభిస్తాయి.

బెర్రీలు

బెర్రీపండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఇది ఆంథోసైనిన్ అని పిలువబడే వయస్సును తగ్గించే యాంటీఆక్సిడెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కొల్లాజెన్ నష్టాన్ని నివారిస్తుంది.

Tags:    

Similar News