ఉసిరితో ఈ ఐదు సమస్యలు పరిష్కారం.. శీతాకాలంలో ది బెస్ట్..
* ఉసిరి రసం శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
Amla Juice: ఉసిరికాయలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. ఇది శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఉసిరిలో టమిన్ సి, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఉసిరి మీ చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.
1. బరువు తగ్గిస్తుంది
ఉసిరి రసం శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. ఎముకలను బలోపేతం చేస్తుంది
వయస్సుతో పాటు మన ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఉసిరి రసం తాగడం వల్ల అవి తిరిగి బలంగా తయారవుతాయి. ఈ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల ఎముకలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
3. ఉసిరితో యవ్వన చర్మం
ఉసిరి రసం తాగడం వల్ల మీ ముఖానికి సహజమైన కాంతి వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను మందగించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. మీకు సహజమైన కాంతిని అందిస్తుంది.
4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
ఉసిరిలో ఉండే విటమిన్ సి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఉసిరి రసం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరి రసం తాగడం వల్ల జలుబు, అల్సర్, పొట్ట సమస్యలను దూరం చేసుకోవచ్చు.
5. పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం
ఉసిరిలో ఉండే మినరల్స్, విటమిన్లు పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. చాలా మంది మహిళలు అధిక రక్తస్రావం, క్రమరహిత పీరియడ్స్, వెన్నునొప్పిని అనుభవిస్తారు. ఈ సమయంలో ఉసిరి రసం ప్రయోజనకరంగా ఉంటుంది.