Health Tips: ఖర్చు తక్కువ ఫలితాలు ఎక్కువ.. కంటిచూపు నుంచి రోగనిరోధక శక్తి వరకు..!
Health Tips: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలలో రోగనిరోధక శక్తి వేగంగా క్షీణిస్తోంది.
Health Tips: ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలలో రోగనిరోధక శక్తి వేగంగా క్షీణిస్తోంది. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ప్రజలలో అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మరోవైపు దేశంలో కాలుష్యం కూడా వేగంగా పెరుగుతుంది. దీని దుష్ప్రభావాలు కళ్లపై కనిపిస్తాయి. దీని వల్ల కంటిచూపులో సమస్యలు ఏర్పడుతాయి. అయితే ఇక్కడ ఒక ఆయుర్వేద రసం గురించి చెప్పాలి. దీనిని ఉపయోగించి కంటి చూపు, రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.
ఉసిరి రసం
రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరి రసం చాలా ఉపయోగపడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీని రోజువారీ ఉపయోగం శరీరంలో ఎర్ర రక్త గణన, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి, ఫ్లేవనాయిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. దీని వాడకం వల్ల డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గుతాయి. దీంతో పాటు శరీరంలో నీటి కొరత లేకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఉసిరి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని అంటు వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కళ్లు ఎర్రబారడం నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద రసం మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇతర కడుపు సంబంధిత వ్యాధులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.