Healtht Tips: ఎండాకాలం ఈ పానీయం తాగితే అద్భుత ప్రయోజనాలు.. చెడు కొలస్ట్రాల్‌కి చెక్..!
Healtht Tips: ఎండాకాలం మొదలైంది. దీంతో చాలామంది డీహైడ్రేషన్‌కి గురికాకుండా రకరకాల పానీయాలు తాగుతారు.
Healtht Tips: ఎండాకాలం మొదలైంది. దీంతో చాలామంది డీహైడ్రేషన్‌కి గురికాకుండా రకరకాల పానీయాలు తాగుతారు. అందులో మజ్జిగ ఒకటి. దీనిని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా దీనిని తయారుచేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనిని తాగడానికి అందరు ఇష్టపడుతారు. ప్యాక్ చేసిన పాల ఉత్పత్తులకు బదులు ఇంట్లోనే మజ్జిగ తయారుచేయడం ఎల్లప్పుడూ ఉత్తమం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
శరీరంలో హై కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఖచ్చితంగా మజ్జిగ తీసుకోవాలి.
కావాలసిన పదార్థాలు
1. అరకప్పు పెరుగు
2. ఒకటిన్నర కప్పు నీరు
3. అవిసె గింజలు
4. జీలకర్ర
5. మెంతి గింజలు
ముందుగా పెరుగు, నీటిని తీసుకుని చర్నర్ సహాయంతో బాగా గిలకొట్టాలి. తర్వాత అవిసెగింజలు, జీలకర్ర, ధనియాల గింజలని సమాన పరిమాణంలో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులో మజ్జిగ పోసి అందులో 1 టేబుల్ స్పూన్ అవిసెగింజల పొడి కలపాలి. దీన్ని మీరు లంచ్‌తో లేదా మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో తాగకలిగితే సహజ మార్గంలో బరువు తగ్గుతారు. అంతేకాదు ఈ పానీయం అధిక కొలెస్ట్రాల్‌పై దాడి చేస్తుంది.