Health Tips: హెవీ వర్కవుట్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్ కచ్చితంగా తినాలి.. లేదంటే చాలా నష్టం..!
Health Tips: మీరు జిమ్‌లో గంటల తరబడి గడుపుతారా.. హెవీ వర్కవుట్స్ చేస్తారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
Health Tips: మీరు జిమ్‌లో గంటల తరబడి గడుపుతారా.. హెవీ వర్కవుట్స్ చేస్తారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేయడం వల్ల శరీరం ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తుంది. ముఖ్యంగా కండరాలు మొత్తం అలసిపోతాయి. వాటికి తిరిగి శక్తిని అందించడం ముఖ్యం. పోస్ట్-వర్కౌట్ రికవరీ కణజాలం నయం, పెరుగుదలకు సహాయపడుతుంది. ఫలితంగా కండరాలు బలంగా ఉంటాయి. జిమ్ చేసేవారు కచ్చితంగా డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవాలి.
ప్యాక్ చేసిన ప్రోటీన్ పౌడర్ మాత్రమే శరీరానికి సరిపోదని గమనించాలి. వర్కౌట్ తర్వాత భోజనంలో కొన్ని సూపర్‌ఫుడ్‌లు లేదా కొన్ని సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చడం వల్ల కండరాల పునరుద్ధరణ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది బాదం. ఇది ఒక సూపర్ ఫుడ్. ఒక పరిశోధన ప్రకారం క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు రోజూ బాదంపప్పులు తినడం వల్ల వారి రక్తంలో మంచి కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఇది శరీరం కండరాల పునరుద్ధరణ ప్రక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 57 గ్రాముల బాదంపప్పును నెల రోజుల పాటు తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. బాదం పప్పులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, అవసరమైన ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి. బాదం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గట్ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది.