తల్లిదండ్రులకి అలర్ట్.. పిల్లలని పరీక్షల ఒత్తిడి నుంచి కాపాడటానికి ఈ చిట్కాలు సూపర్..!
Health Tips: ప్రస్తుతం దాదాపు అన్ని పాఠశాలల్లో ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి.
Health Tips: ప్రస్తుతం దాదాపు అన్ని పాఠశాలల్లో ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మరి కొంతమంది పిల్లలకు బోర్డ్ ఎగ్జామ్స్ మొదలు కాబోతున్నాయి. దీనివల్ల పిల్లలపై ఎక్కువ చదువులు చదవాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఫైనల్ ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో కూడా టెన్షన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు పరీక్షల సమయం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఈ సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లలను ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. దానికోసం కొన్ని పద్దతులని పాటించాలి.
పిల్లలను పగలు, రాత్రి వారు సరైనది అని భావించే సమయంలోనే చదువుకోనివ్వాలి. పిల్లలను ఇతర పిల్లలతో ఎప్పుడు పోల్చవద్దు. ప్రతి ఒక్కరి సామర్థ్యం వేరు వేరుగా ఉంటుంది. పిల్లల నుంచి సరైన అంచనాలు, ఎక్కువ మార్కులు వచ్చేలా వారిపై ఒత్తిడి పెంచవద్దు. పిల్లల గత వైఫల్యాల గురించి మాట్లాడవద్దు. పిల్లవాడు ఎక్కువ కాలం చదవాలంటే తల్లిదండ్రులలో ఒకరు అతనితో పాటు మేల్కొని ఉండాలి. అది అతని ధైర్యాన్ని పెంచుతుంది.
ఈ సమయంలో పిల్లలతో చదువులు, సిలబస్ గురించి మాట్లాడవద్దు. భవిష్యత్తు ప్రణాళికలు, కెరీర్ మొదలైన వాటి గురించి చర్చించవద్దు. మేము ఎల్లప్పుడూ మీతో ఉంటామనే భరోసా కల్పించాలి. పిల్లలు నిరంతర తలనొప్పి, శరీర నొప్పి, తల తిరగడం, వికారం, మతిమరుపు, భయము, అలసట, చదువుపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలను చెబితే వాటిపై శ్రద్ధ వహించండి. బహుశా అతను చాలా ఒత్తిడిలో ఉన్నాడని అర్థం చేసుకోండి. చదువుకోకుండా సాకులు చెబుతున్నాడని అనుకోవద్దు. ఈ సందర్భంలో వెంటనే అతనిని సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లండి.