Women Health: మహిళలకు అలర్ట్.. మొదటి సారి తల్లి అయ్యారా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Women Health: తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ తల్లి అయ్యాక బిడ్డను చూసుకునే క్రమంలో తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తుంది. దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందిపడుతుంది.

Update: 2024-05-11 16:00 GMT

Women Health: మహిళలకు అలర్ట్.. మొదటి సారి తల్లి అయ్యారా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Women Health: తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ తల్లి అయ్యాక బిడ్డను చూసుకునే క్రమంలో తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తుంది. దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందిపడుతుంది. తల్లి కావడం మంచి అనుభూతి అయినప్పటికీ బిడ్డ ఆరోగ్యంతో పాటు తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అలాగే డెలివరీ అయ్యాక మహిళ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అందుకే చాలామంది మహిళలు ప్రసావనంతరం డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఇలా కావొద్దంటే ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రోజులో కొంత సమయాన్ని మీకోసం వెచ్చించాలి. ఈ సమయంలో మీకు సంతోషాన్ని కలిగించే పనులను చేయాలి. తల్లి అయిన తర్వాత మహిళలు అనేక మార్పులకు లోనవుతారు. శారీరక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను సంతోషంగా స్వీకరించాలి. బరువుగా ఫీల్‌ కాకూడదు. మనస్సులోకి ఎలాంటి నెగటివ్‌ ఆలోచనలు రానివ్వకూడదు. జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించడం అలవాటు చేసుకోవాలి.

అలాగే పిల్లలు పడుకున్న తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఫిట్‌గా ఉంటారు. ఇది కాకుండా దినచర్యలో యోగా, వ్యాయామం చేయాలి. కొన్ని నెలల తర్వాత పిల్లలతో కలిసి నడకకు వెళితే మంచి అనుభూతి పొందుతారు. పెరుగుతున్న బరువును తగ్గించడంలో ఇది మీకు తోడ్పడుతుంది.మీ జీవితంలో కొత్త మార్పు కోసం జీవిత భాగస్వామి సాయం తీసుకోవచ్చు.

Tags:    

Similar News