Recharge plan: రూ. 149తో 20 ఓటీటీ సేవలు యాక్సెస్..
Recharge plan: రూ. 149తో 20 ఓటీటీ సేవలు యాక్సెస్..
Recharge plan: ప్రస్తుతం టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. సంస్థల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓటీటీ లవర్స్‌ని టార్గెట్ చేసుకొని కొంగొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో టెలికాం కంపెనీలు ఉచితంగా ఓటీటీ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఇందుఓలో భాగంగా తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఏకంగా 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్ పొందే అవకాశం కల్పించారు. రూ. 149తో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. టారిఫ్ ధరలను పెంచిన నేపథ్యంలో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎయిర్‌టెల్ ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్లాన్‌తో ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు అదనంగా 1జీబీ డేటా పొందొచచు. మీకు అప్పటికే ఉన్న ప్లాన్‌కు యాడ్ ఆన్ లాగా ఉపయోగపడుతుంది. మీకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ వ్యాలిడిటీ ఆధారంగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌తో రీఛార్జ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్ పొందొచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఈరోస్ నౌ, hoichoiతో పాటు మొత్తం 20 ఓటీటీ సేవలు పొందొచ్చు. ఓటీటీ లవర్స్‌కి ఇది బెస్ట్ రీఛార్జ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఎయిరట్ టెల్ యాప్ లేదా ఇతర పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ రీఛార్జ చేసుకునే అవకాశం కల్పించారు.