Air Pollution: వాయు కాలుష్యంతో గుండెకి తీవ్ర ఎఫెక్ట్.. ఇలా కాపాడుకోండి..!
Air Pollution: వాయు కాలుష్యంతో గుండెకి తీవ్ర ఎఫెక్ట్.. ఇలా కాపాడుకోండి..!
Air Pollution: శీతాకాలం వచ్చేసింది. దీంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. చలి రోజు రోజుకి పెరుగుతోంది.దీంతో పాటు వాయు కాలుష్యం కూడా పెరగడం మొదలైంది. వాతావరణం చల్లబడినప్పుడు పొగమంచు పెరుగుతుంది. ఈ స్మోగ్ ఆరోగ్యానికి చాలా హానికరం. పొగమంచు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక సమస్యలు ఏర్పడుతాయి. అయితే ఇది ఊపిరితిత్తులకే కాదు గుండెకు కూడా చాలా ప్రమాదకరం. పొగమంచు మన గుండె ఆరోగ్యానికి అనేక ప్రమాదాలను కలిగిస్తుంది.
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాయు కాలుష్యానికి గురికావడం వల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మనం చెడ్డ గాలిని పీల్చినప్పుడు, గాలిలో ఉండే కాలుష్య కారకాలు ఊపిరితిత్తులు, గుండెకు వెళ్లే రక్తప్రవాహంలోకి వెళుతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గాలిలో ఉండే కాలుష్య కారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రక్తం స్వేచ్ఛగా ప్రవహించడం కష్టమవుతుంది. దీని కారణంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
శరీరంలోని ఇతర భాగాలకు చేరుకోవడానికి గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.దీని కారణంగా గుండె వైఫల్యం సంభవిస్తుంది. ఇది మాత్రమే కాదు ఇప్పటికే ఏదైనా గుండె సమస్య ఉంటే వారు గుండెపోటుకు గురవుతారు.వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవాలంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవసరమైన విటమిన్లు, పోషకాలు అందేలా చూసుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్ పెరుగుతుంది. రెగ్యులర్ వ్యాయామాన్ని చేయాలి.