Health Tips: టీలో షుగర్‌కి బదులు దీనిని కలపండి.. ఆరోగ్యానికి హాని ఉండదు..!
Health Tips: భారతదేశంలో టీ ప్రేమికులు ఎక్కువ మంది ఉంటారు.
Health Tips: భారతదేశంలో టీ ప్రేమికులు ఎక్కువ మంది ఉంటారు. చాలామందికి టీతోనే రోజు మొదలవుతుంది. ఉద్యోగులైతే రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో చెప్పడం కష్టం. కానీ ఈ అలవాటు శరీరానికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే టీలో ఉండే చక్కెర ఊబకాయం, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఓ పరిష్కారం ఉంది. దాని గురించి తెలుసుకుందాం.
టీలో చక్కెరకు బదులుగా బెల్లం కలిపితే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. మీరు టీ తాగే అలవాటుని మానలేకపోతే దీనిని తయారు చేసే విధానంలో మార్పులు చేయాలి. పంచదారకు బదులుగా అందులో ఆరోగ్యకరమైన బెల్లం కలుపవచ్చు. దీనివల్ల శరీరం కొన్ని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందుతుంది. అవేంటో చూద్దాం.
1. బరువు పెరగరు
టీలో పంచదార కలుపుకుని తాగడం వల్ల బరువు, బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. మీరు చక్కెరకు బదులుగా బెల్లం చేర్చినట్లయితే అందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
2. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది
టీలో బెల్లం కలపడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి పొట్ట సమస్యలు రావు. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ అన్ని విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
3. రక్తహీనత ఉండదు
చాలా మందికి వయసు పెరిగే కొద్దీ రక్తహీనత సమస్య మొదలవుతుంది. దీంతో బాధపడే వ్యక్తి సాధారణ పని చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితిలో బెల్లం టీ తాగితే ఇందులో ఉండే ఐరన్ శరీరంలోని రక్త లోపాన్ని తీరుస్తుంది.