ఆ పార్టీని వెంటబెట్టుకుని ముందుకెళ్తా..: జగన్

Update: 2019-04-01 00:39 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీశారు. టీఆర్ఎస్ పార్టీతో కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన వైఎస్ జగన్ మోహ‍న్ రెడ్డి. తాజాగా ఆ పార్టీని వెంటబెట్టుకుని ముందుకు వెళ్తానని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక కోసం తాను టీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రయత్నిస్తానన్నారు జగన్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ కూడా స్పష్టమైన మెజారిటీ రాదున్నారు జగన్.

ఏపీలో 25 ఎంపీ స్థానాలలో వైసీపీ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే సర్కార్‌లో మనమే కీలకం అవుతామన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తెలంగాణ 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటామన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, దర్శిల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీ పార్టీకి ఏపీ ప్రజలు అన్ని ఎంపీ సీట్లూ ఇస్తే మనం అంత బలంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు.చంద్రబాబు వల్ల ప్రత్యేక హోదా రాదని జగన్ స్పష్టం చేశారు. వైసీపీని గెలిపించుకుందాం ప్రత్యేకహోదా తెచ్చుకుందామని జగన్ పిలుపునిచ్చారు. 

Similar News