OPPO Reno 13: ఒప్పో నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే..!

Oppo Reno 13 and Reno 13 Pro Launched in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

Update: 2025-01-10 08:32 GMT

OPPO Reno 13: ఒప్పో నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే..!

Oppo Reno 13 and Reno 13 Pro Launched in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో రెనో 13 సిరీస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఒప్పో రెనో 13 సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేశారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్‌ను మొట్టమొదటిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.59 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 1.5కే అమో ఎల్‌ఈడీ, 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన అల్ట్రావైడ్ రెయిర్‌ కెమెరాను అందించారు.

సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5600 ఎంఏహెచ్‌ బ్యాటరీరి అందించారు. యాంటీ డస్ట్‌, యాంటీ వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం ఐపీ66, ఐపీ 69 రేటింగ్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 37,999కాగా 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 39,999గా నిర్ణయించారు.

ఇక ఒప్పో రెనో 13 ప్రో ఫోన్‌లో 6.83 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 49,999 కాగా 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 54,999గా నిర్ణయించారు. ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ ఫోటో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ వంటి ఫీచర్లను అందించారు.

Tags:    

Similar News