ఆ పుణ్యం కట్టుకుంది.. ఎన్టీఆరే: సీఎం కేసీఆర్
ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీఆరేనన్నారు కేసీఆర్. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి పుణ్యం కట్టుకుంది ఎన్టీ రామారావే అన్నారు. ఎన్టీఆర్ వల్లే చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు అయ్యారని గుర్తుచేశారు.
ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీఆరేనన్నారు కేసీఆర్. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి పుణ్యం కట్టుకుంది ఎన్టీ రామారావే అన్నారు. ఎన్టీఆర్ వల్లే చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు అయ్యారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌లో కూడా బీసీలకు 51శాతం పదవులు కల్పించాలని తమ పార్టీ రాజ్యాంగంలో రాసుకున్నామని అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ప్రయత్నిస్తామని కెసిఆర్ తెలిపారు. జనాభా ఉన్నారు. డిమాండ్ ఉంది. ఈ పుణ్యం బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పించాలని మొత్తంగా పుణ్యం కట్టుకుంది ఎన్టీఆరే అని అన్నారు. ఎవరైతే ఏంది ఉన్నమాట చెప్పుకోవాలన్నారు సీఎం కెసిఆర్. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.