తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు ఆలయాల అధికారులు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు ఆలయాల అధికారులు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు సీఎంలు కేసీఆర్, జగన్.
చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు.
సత్యం, దర్మం సహనం తోడుగా మనిషి తన లోపలి చెడు గుణాల్ని బయట సవాళ్ళని అధిగమించవచ్చునని ఈ పర్వదినం ఇస్తున్న సందేశం.. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అయిరారోగ్యలూ ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ తెలంగాణ పెద్ద పండగను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని తెలుపుతూ దసరా శుభాకాంక్షలు అని కేసీఆర్ ట్వీట్ చేశారు.