తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఉల్లి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. పలుచోట్ల కిలో ఉల్లి ధర 100 రూపాయలకు పైగా పలుకుతుండటంతో ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. పలుచోట్ల కిలో ఉల్లి ధర 100 రూపాయలకు పైగా పలుకుతుండటంతో ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్కెటింగ్ శాఖ ద్వారా మరోసారి సబ్సిడీ ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతు బజార్లలో కిలో ఉల్లిని నేటి నుంచి 40 రూపాయలకే విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. ఒంగోలులోని రైతు బజార్‌లో సబ్సిడీ ఉల్లిపాయలను మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు పంపిణీ చేశారు.