పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ అభ్యర్థులు కరువు
పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులు కరువయ్యారు. రిజర్వేషన్ల కేటాయించిన స్థానాల్లో ఎస్టీలు లేకపోవడం ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై సందిగ్ధం నెలకొంది. సర్పంచ్ కాకుండా కేవలం వార్డు మెంబర్లకు మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులు కరువయ్యారు. రిజర్వేషన్ల కేటాయించిన స్థానాల్లో ఎస్టీలు లేకపోవడం ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై సందిగ్ధం నెలకొంది. సర్పంచ్ కాకుండా కేవలం వార్డు మెంబర్లకు మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికలంటే అంతా పోటీకి ముందుకు వస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చోటామోటా కార్యకర్తలు సైతం పోటీ సై అంటారు. అభ్యర్థుల లిస్టు చాంతాండంతా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే వారికి గుర్తులు కేటాయించలేక అధికారులు అవస్థలు పడుతుంటారు. కానీ ఈసారి చాలా ప్రాంతాల్లో సీన్ రివర్స్ అయింది. తండాలు కొత్త పంచాయతీలుగా రూపాంతరం చెందాయి. తండాలు ఎస్టీలకు రిజర్వేషన్ అయ్యాయి. అయితే ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎస్టీ ఓటర్లు లేకపోవడం తలనొప్పిగా మారింది.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, ప్రశాంత్ నగర్, లక్ష్మాపూర్ , వంగూరోనిపల్లి, కల్మూలోనిపల్లి గ్రామాల్లో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించారు. అయితే అక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో ఆ గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. కుమ్మరోనిపల్లి లో 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా ఐదు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం కష్టంగా మారింది.
అమ్రాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఐదు గ్రామాల్లో ఎస్టీలు లేకపోవడంతో ఈసారి కూడా ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్న గ్రామస్తుల్లో నెలకొంది. ఎస్టీలు లేకపోవడంతో సర్పంచ్ కు కాకుండా కేవలం వార్డు మెంబర్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.