iPhone 14, iPhone 14 Plus: అక్కడి యాపిల్ ఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్... ఐఫోన్ 14, 14 ప్లస్ ఇక కొనలేరు

Update: 2024-12-22 14:00 GMT

iPhone 14, iPhone 14 Plus: ఐరోపా యూనియన్‌లోని 27 దేశాల్లో ఆపిల్ ప్రముఖ ఐఫోన్ మోడల్స్ iPhone 14, 14 Plus, SE అమ్మకాలను నిలిపి వేసే అవకాశం ఉంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్‌లో సాధారణ ఛార్జర్ నియమాలు డిసెంబర్ 28 నుండి అమలులోకి రానున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. iPhone 14,  iPhone 14 Plus ఇకపై స్విట్జర్లాండ్‌లో అమ్మకానికి రావు. ఈ ఫోన్స్ లాంచ్ అయిన రెండేళ్ల తర్వాత యూరోపియన్ యూనియన్ (EU)లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాన్ని కంపెనీ నిలిపివేయవచ్చని తెలుస్తోంది.

కంపెనీ 2022లో లాంచ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్ అమ్మకాన్ని కూడా ఆపేస్తుంది. థర్డ్ జనరేషన్ iPhone SE. మూడు ఐఫోన్ మోడల్స్ లైట్నింగ్ పోర్ట్‌తో ఉన్నాయి. కంపెనీ తన అనేక మోడళ్లలో లైట్నింగ్ పోర్ట్‌ని యూనివర్సల్ USB టైప్-సి పోర్ట్‌తో రీప్లేస్ చేసింది.

రూమర్స్ ప్రకారం.. స్విట్జర్లాండ్‌లోని తన వెబ్‌సైట్ ద్వారా యాపిల్ iPhone 14, iPhone 14 Plus, iPhone SE (2022) విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే స్టోర్‌లో అమ్మకాలు గడువు వరకు కొనసాగుతాయి.

స్విట్జర్లాండ్ ఐరోపా సమాఖ్య లేదా యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (EEA)లో భాగం కాదని, ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్ , నార్వేలతో పాటుగా ఆ దేశం యూరోపియన్ సింగిల్ మార్కెట్ (లేదా యూరోపియన్ కామన్ మార్కెట్)లో భాగం కావడం గమనించదగ్గ విషయం. ఫలితంగా కంపెనీ ఈ ప్రాంతాలతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలలో తన స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలను నిలిపివేయాలని భావిస్తున్నారు.

దీని అర్థం డిసెంబర్ 28 గడువు తరువాత Apple ఇకపై అధికారికంగా EUలో iPhone SE మోడల్‌లను విక్రయించదు. అయితే రీసేల్ కాగా మిగిలిన యూనిట్లను విక్రయించడాన్ని కొనసాగించవచ్చు. యాపిల్ ఇప్పటికే పోర్త్ జనరేషన్ iPhone SE మోడల్‌పై పని చేస్తోందని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఇది అప్‌డేట్ డిజైన్, ఫేస్ ID, కంపెనీ అంతర్గత మోడెమ్ చిప్‌తో రావచ్చు.

ఈ చిక్కుల నుండి బయటపడాలంటే ఇకపై EU కస్టమర్స్ ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 16లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు USB టైప్-సి పోర్ట్‌తో ఉంటాయి. కాబట్టి కంపెనీ డిసెంబర్ 28 తర్వాత కూడా వాటి విక్రయాన్ని కొనసాగించవచ్చు. Apple తన ఇతర గ్యాడ్జెట్లైన AirPods Pro (సెకండ్ జనరేషన్),  AirPods Max వంటి USB టైప్-C పోర్ట్‌లతో గడువు కంటే ముందే అప్‌డేట్ చేసింది.

Tags:    

Similar News