Mahindra Bolero Sales: డిమాండ్ విషయంలో తగ్గేదేలే అంటున్న మహీంద్రా బొలెరో
Mahindra Bolero Sales in 2024: భారత మార్కెట్లో, మహీంద్రా బొలెరో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి SUVలతో పోటీపడుతుంది.
Mahindra Bolero Sales in 2024: ఇండియాలో మహీంద్రా కార్లకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత 11 నెలల్లో అంటే జనవరి నుండి నవంబర్, 2024 వరకు, మహీంద్రా SUV బొలెరో 90,000 కంటే ఎక్కువ SUV లను విక్రయించడమే అందుకు నిదర్శమని మహింద్రా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆ సమయంలో మహీంద్రా బొలెరోకు మొత్తం 91,063 మంది కొత్త కస్టమర్స్ యాడ్ అయ్యారన్నమాట. మహీంద్రా బొలెరో ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా బొలెరో పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే.. బొలెరోలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది, ఇది గరిష్టంగా 76Bhp పవర్, 210Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. మహీంద్రా బొలెరో 7-సీటర్ SUV. ఇది భారతీయ వినియోగదారుల కోసం మొత్తం 3 వేరియంట్స్‌లో లభిస్తుంది. భారత మార్కెట్లో, మహీంద్రా బొలెరో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి SUVలతో పోటీపడుతుంది.
మరోవైపు ఫీచర్లుగా మహీంద్రా బొలెరోలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ కనెక్టివిటీతో కూడిన బ్లూటూత్ ఎనేబుల్డ్ మ్యూజిక్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పవర్ స్టీరింగ్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా భద్రత కోసం, SUVకి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు అందించారు. మార్కెట్లో మహీంద్రా బొలెరో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Mahindra Bolero Ex-showroom Prices) టాప్ మోడల్ కోసం రూ.9.79 లక్షల నుండి రూ.10.91 లక్షల వరకు ఉంది.