దేశంలో మార్పు రావాలంటే.. గ్రామంలో మార్పు రావాలి: హజారే

యువత సరికొత్త దిశగా ప్రయాణించి అద్బుతాలు సృష్టించాలన్నారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Update: 2019-01-19 10:39 GMT

యువత సరికొత్త దిశగా ప్రయాణించి అద్బుతాలు సృష్టించాలన్నారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహాత్మాగాంధీ చూపించిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నాలుగు గోడల మధ్య పూజలు ప్రార్థనలు జరుగుతుంటాయని కానీ గ్రామమే ఒక మందరిమన్నారు. గాంధీ భజన వైష్ణవ జనకో తేనే కహియెజే గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తనకిప్పుడు 81 సంవత్సరాలని పేర్కొన్న హాజారే తన స్వగ్రామమైన రాలిఖన్ సిద్ధిలో ఎన్నో సమస్యలుండేవన్నారు. కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి భోజనం లేదన్నారు. దేశంలో మార్పు రావాలంటే ముందుగా గ్రామంలో మార్పు రావాలని గాంధీ పిలుపునిచ్చారని హజరే తెలిపారు. 

Similar News