Vivo T3 Pro-T3 Ultra: వివో స్పెషల్ ఆఫర్.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

Vivo T3 Pro-T3 Ultra: చైనీస్ టెక్ కంపెనీ వివో గత సంవత్సరం T సిరీస్‌లో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

Update: 2025-01-15 05:39 GMT

Vivo T3 Pro-T3 Ultra: చైనీస్ టెక్ కంపెనీ వివో  గత సంవత్సరం T సిరీస్‌లో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇవి మంచి కెమెరా ఫీచర్ల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు T3 ప్రో, T3 అల్ట్రా లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత వివో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను తగ్గించింది. మీరు కూడా డిస్కౌంట్లతో ఈ ఫోన్లను కొనాలంటే వాటి ఫీచర్లు, ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Pro, Vivo T3 Ultra Price

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. భారతదేశంలో Vivo T సిరీస్ ధరలు రూ. 2000 తగ్గాయి. Vivo T3 Pro ఇప్పుడు 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 22999. 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 24999గా నిర్ణయించారు.

మరోవైపు, Vivo T3 అల్ట్రా 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్,పార్టనర్ రిటైల్ స్టోర్‌ల నుంచి మీ సొంతం చేసుకోవచ్చు. 

Vivo T3 Pro, Vivo T3 Ultra Features And Specifications

వివో T3 అల్ట్రా మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అదే సమయంలో T3 ప్రో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. రెండూ 8GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. Vivo T3 అల్ట్రా 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను, 120Hz రిఫ్రెష్ రేట్, 4500నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ అందిస్తుంది. అయితే T3 ప్రో 6.77 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

వివో T3 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. T3 అల్ట్రా‌లో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ ఉంది. దీనిలో OIS మద్దతుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News