Amazon Great Republic Day Sale: అమెజాన్ రిపబ్లిక్ డేస్ సేల్.. పవర్ బ్యాంక్స్, మొబైల్స్‌పై కళ్లు చెదిరే డీల్స్

Update: 2025-01-12 15:30 GMT

Amazon Great Republic Day Sale: రిపబ్లిక్ డే దగ్గరలోనే ఉంది. ఈ సందర్భంగా అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రత్యేక సేల్స్‌ను ప్రకటించాయి. ఈ సేల్ సమయంలో,స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, పవర్ బ్యాంక్‌లు, ల్యాప్‌టాప్ వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై మంచి తగ్గింపు, ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎలక్ట్రానిక్స్ లేదా గాడ్జెట్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఉత్తమమైన ఉత్పత్తులను ఉత్తమమైన డీల్స్‌లో కొనుగోలు చేయగలిగేలా Amazon ఉత్తమ డీల్స్‌పై ఒక కన్నేసి ఉంచాలి.కాబట్టి పవర్ బ్యాంక్‌లు, మొబైల్, ల్యాప్‌టాప్ టూల్స్‌కు సంబంధించిన అత్యుత్తమ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి, తద్వారా మీరు వాటిని విష్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రైమ్ మెంబర్‌ల కోసం ఈ సేల్ అర్ధరాత్రి 12 గంటలకే యాక్సెస్ ఉంటుంది. మిగిలిన వినియోగదారుల కోసం, ఈ సేల్ రేపటి నుండి అంటే జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రీ డీల్స్ లైవ్ చేశారు. 

ఈ అమెజాన్ సేల్ మొబైల్స్ ధరలపై భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది. మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ సేల్‌లో Samsung, Apple, OnePlus వంటి బ్రాండ్‌లు కూడా భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు ఇప్పుడు లాక్ చేయగల మొబైల్‌లకు సంబంధించిన ఉత్తమమైన డీల్‌లను ఇక్కడ చూడచ్చు. 

ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యుగంలో ఎక్కడికెళ్లినా సరే మీ డివైజెస్ నాన్-స్టాప్ ఛార్జింగ్‌లో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మంచి పవర్ బ్యాంక్ అవసరం. అమెజాన్ సేల్‌లో కాంపాక్ట్ మోడల్స్ నుండి హై కెపాసిటీ మోడల్స్ వరకు పవర్ బ్యాంక్‌ సెలెక్ట్ చేసుకునేందుకు అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

అదులోనూ ఫాస్ట్ ఛార్జింగ్, మల్టీ అవుట్‌పుట్‌లు, సేఫ్టీ మెకానిజంతో ఎప్పటికప్పుడు కొత్తకొత్త పవర్ బ్యాంక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. నేటి టెక్-ఫ్రెండ్లీ యుగంలో, ఈ పవర్ బ్యాంక్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ద్వారా ల్యాప్‌టాప్‌కు అవసరమైన మౌస్, కీబోర్డ్, కూలింగ్ ప్యాడ్‌లను ఈ సేల్ ద్వారా అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

Tags:    

Similar News