Flipkart Monumental Sale: ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సేల్.. ఐఫోన్ 16 సిరీస్‌పై బ్లాక్‌బస్టర్ డీల్స్
Flipkart Monumental Sale: ఫ్లిప్‌కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించింది. దీనిని "మాన్యుమెంటల్ సేల్" అని పిలుస్తారు. ఈ సేల్ వెబ్‌సైట్‌లో లైవ్ అవుతుంది. జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్, ఇతర ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై పెద్ద తగ్గింపులను అందిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ తమ సైట్‌లో పండుగల సమయంలో డీల్స్ ధరలను మార్చే ట్రాక్ రికార్డ్ సెట్ చేసింది. కాబట్టి రిపబ్లిక్ డే సేల్ చివరి రోజు వరకు ధరలు అలాగే ఉంటాయో లేదో చెప్పలేం. మాన్యుమెంటల్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 సిరీస్‌పై రూ. 12,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 16 Offer
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర రూ. 67,999. ఎటువంటి కండీషన్స్ లేకుండా రూ. 12,000 ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ మొబైల్‌ను భారత్‌లో రూ.79,999 ధరతో లాంచ్ చేశారు. అయితే, ఈ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తుంది. వెబ్‌సైట్‌లో దీని ధర రూ. 69,999గా ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి బ్యాంక్ కార్డ్‌లపై మీరు రూ. 3,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
iPhone 16 Plus
అదేవిధంగా, ఐఫోన్ 16 ప్లస్ ధర ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌లో రూ.79,999గా ఉంది. ఈ ప్లస్ మోడల్‌ను రూ. 89,900కి విడుదల చేశారు. కాబట్టి ఫ్లిప్‌కార్ట్ మొత్తం రూ.9,901 తగ్గింపును ఇస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే రూ. 4,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
iPhone 16 Pro
ఐఫోన్ 16 ప్రో కూడా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో లభిస్తోంది. అయితే ఇది భారతదేశంలో రూ. 1,19,900కి విడుదల చేశారు. ప్రస్తుతం రూ.7,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ ధర రూ. 1,12,900 అయింది. కానీ, ఈ డీల్ వైట్ కలర్ మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇది కాకుండా, బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 వరకు అదనపు తగ్గింపు కూడా ఇస్తుంది.
iPhone 16 Pro Max
చివరగా, ఐఫోన్ 16 ప్రో మాక్స్ కూడా ఈ సేల్‌లో రూ. 1,37,900కి అందుబాటులో ఉంది. దీని ధర గతంలో రూ. 1,44,900. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర స్టోరేజ్ వేరియంట్‌లపై డీల్‌లను కూడా చెక్ చేయవచ్చు.