కేవలం ఈ దేశాలలో మాత్రమే వైరస్ వ్యాప్తి తగ్గుదల
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి రెండవ దశ ప్రారంభం అయింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి రెండవ దశ ప్రారంభం అయింది. ప్రపంచంలోని 81 దేశాలలో రెండో దశ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వీటిలో ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, స్వీడన్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఉన్నాయి. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ ఆసియా, మిడిల్ ఈస్ట్ ,ఆఫ్రికన్ దేశాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ జెబ్రేస్ అన్నారు.
అన్‌లాక్ చేయడం వల్ల చాలా దేశాల్లో కరోనా విజృంభించే ప్రమాదం పెరుగుతోందని చెప్పారు. కరోనాకు వ్యతిరేకంగా రక్షణ నియమాలను కూడా కొన్ని దేశాల్లో ప్రజలు పాటించడం లేదని. అందువల్ల ఈ దేశాలలో, గత రెండు వారాల్లో సంక్రమణ తీవ్రమైందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 48 గంటల్లో సంభవించిన కొత్త కేసుల్లో సగం యుఎస్‌లో ఉన్నాయని చెప్పారు.
ఇక ఆఫ్రికాలో 100 రోజుల్లో 1 లక్ష కేసులు నమోదయితే.. ఇప్పుడు కేవలం 19 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. దక్షిణాఫ్రికాలో రోజుకు సగటున 1000 కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 36 దేశాలలో మాత్రమే కొత్త కరోనా కేసులు తగ్గాయి.ఇక కరోనా ఉదృతి దృష్ట్యా ప్రభావిత దేశాలన్నీ పరీక్షలను పెంచాలని. అనుమానిత రోగులకు దిగ్బంధం చెయ్యాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది.