అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

Russia-Ukraine war: అమెరికా, ఐరోపా దేశాలు ఊహించిందే జరిగింది.

Update: 2022-02-24 15:16 GMT

అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?

Russia-Ukraine war: అమెరికా, ఐరోపా దేశాలు ఊహించిందే జరిగింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో ఉక్రెయిన్‌ ఆక్రమణకు సైన్యం బయలుదేరింది. దీంతో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎవరు? ఎందుకు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగారనేది జోరుగా చర్చ సాగుతోంది.

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 1952లో వ్లాదిమిర్‌ పుతిన్‌ జన్మించారు. పుతిన్‌ రష్యా గుడాచార సంస్థ కేజీబీలో 1975లో చేరి 1990 వరకు పని చేశారు. సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరువాత క్రెమ్లిన్‌ అధికారిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత బోరిస్‌ ఎల్షన్‌ రష్యా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1999లో ప్రధాని ఎన్నికయ్యాడు. అనంతరం 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

గ్యాస్‌ కోసం యూరోపిన్‌ దేశాలు రష్యాపై ఆధారపడ్డాయి. దీంతో పుతిన్‌ అంతర్జాతీయంగా మరింత బలపడ్డాడు. 2012లో మరోసారి అధ్యక్షుడిగా పుతిన్‌ ఎన్నికయ్యారు. సోవియట్‌ యూనియన్‌కు పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటున్న పుతిన్‌ ఆ తరువాత రెండేళ్లలో అంటే 2104లో క్రిమియాను ఆక్రమించుకున్నాడు. సాధారణంగా రష్యా అధ్యక్షుడిగా వరుసగా రెండుసార్లు మాత్రమే ఎన్నికవుతారు. అధికారం వదులుకోవడం ఇష్టంలేని పుతిన్‌ అప్పటి ప్రధాని మెద్వేదేవ్‌తో కలిసి.. పదవీ స్థానాలను మార్చుకున్నారు. 2014లో రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

2013 నుంచి 2016 వరకు ప్రపంచంలోనే అంత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నాలుగు సార్లు పుతిన్‌ గుర్తించబడ్డాడు. 2017లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికయ్యేలా పుతిన్‌ సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను పుతిన్, ట్రంప్‌ తోసిపుచ్చారు. 2018లో అధ్యక్షుడిగా పుతిన్‌ మరోసారి ఎన్నికయ్యారు. 2024లో తాను అధికారం కోల్పోకుండా రాజ్యాంగ మార్పులకు ప్రతిపాదించాడు. అధికారం కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు ప్రారంభించాడు.

పుతిన్‌ రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిపోతున్నట్టు అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడానికి పావులు కదిపారు. ఉక్రెయిన్‌ను మణి మకుటంగా పుతిన్‌ వర్ణించారు. 2021లో ఇరు దేశాల ప్రజలు ఒక్కటవుతారని పుతిన్‌ ప్రకటించారు.

Tags:    

Similar News