Vladimir Putin: న్యూక్లియర్ డ్రిల్‌ను పర్యవేక్షించిన అధ్యక్షుడు పుతిన్
Vladimir Putin: ఉక్రెయిన్‌పై న్యూక్లియర్ దాడికి సిద్ధమవుతున్న రష్యా..?
Vladimir Putin: ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్‌లోని రష్యా బలగాలకు సరఫరా చేయాలని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌పై అణుదాడికి రష్యా సిద్ధం అవుతోందా? ఈ అనుమానాలకు బలమిస్తూ రష్యా న్యూక్లియర్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహాత్మక అణు శక్తుల డ్రిల్‌ను స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పుతిన్ రష్యన్ వ్యూహాత్మక అణు దళాల కసరత్తులను గమనిస్తున్నట్లు స్వయంగా రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది.
సాయుధ దళాల సుప్రీం కమాండర్- ఇన్ చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలో భూతల, జల, వాయు వ్యూహాత్మక నిరోధక దళాలతో శిక్షణా సమావేశం జరిగింది. ఈ సమయంలో బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల ఆచరణాత్మక ప్రయోగాలు జరిగాయని క్రెమ్లిన్ తన ప్రకటనలో పేర్కొంది. కంట్రోల్ రూంలో కూర్చొని డ్రిల్స్‌ను పుతిన్ వీక్షిస్తున్నట్లు వీడియోలు, ఫొటోలు బయటకు పొక్కాయి. ఇక ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు పుతిన్ ఆరోపిస్తూ వస్తున్నారు. మంగళవారం భారత్, చైనా ప్రతినిధులతో సంభాషణల సందర్భంగా ఆయన డర్టీ బాంబ్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.