Bangladesh Violence:బంగ్లాదేశ్ లో మళ్లీ హింసాత్మక ఘటనలు..100మంది మృతి..14 మంది పోలీసులు

Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులకు, అధికారపార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో వందమంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Update: 2024-08-05 03:29 GMT

Bangladesh Violence:బంగ్లాదేశ్ లో మళ్లీ హింసాత్మక ఘటనలు..100మంది మృతి..14 మంది పోలీసులు

Bangladesh Violence:బంగ్లాదేశ్ మరోసారి హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికారపార్టీ మద్దతుదారులకు మధ్య ఆదివారం హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులతోపాటు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల్లో వందలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమకు మద్దతుగా నిలవాలంటూ కోరారు.

ఇక ప్రధానమంత్రి హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళణకారులను అధికారు అవామీలీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు నెలకున్నాయి. దీంతో వాటిని నిరోధించేందుకు పలు చోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఢాకాలో ఓ షాపింగ్ మాల్ కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో పెద్దెత్తున మంటలు చెలరేగాయి. సిరాజ్ గంజ్ లోని ఓ పోలీస్ స్టేషన్ కు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 14 మంది పోలీసులు మరణించారు. మొత్తం 300 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగిన దాడుల్లో దాదాపు 100మంది మరణించినట్లు బెంగాలీ పత్రిక ప్రొథోం అలో వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూను విధించింది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రమ్ సేవలను నిలిపివేశారు.

భారత హైకమిషన్ హెల్ప్ లైన్ నెంబర్స్ జారీ

బంగ్లాదేశ్ లో ఉన్న భారత పౌరులందరూ జాగ్రత్త ఉండాలని భారత హైకమిషనర్ కోరింది. కర్ప్యూ పరిస్థితుల నేపథ్యంలో బయటకు రావద్దంటూ సూచించింది. ఈ నేపథ్యంలో ఢాకాలో ఉన్న భారత హైకమిషన్ తో అత్యవసర ఫోన్ నెంబర్స్ తో టచ్ ఉండాలని సూచించారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను జారీ చేసింది. ఫోన్ నెంబర్స్ +8801958383679, +8801958383680, +8801937400591.

ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ:

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ప్రజలు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శన ఇప్పుడు హింసాత్మక రూపం దాల్చింది.


Tags:    

Similar News