Coronavirus Vaccine : అమెరికా కరోనా వాక్సిన్ వచ్చేస్తోంది... రెడీ అవమంటున్న సీడీసీ!
Cronavirus Vaccine : కంటికి కనిపించని కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తుంది.. ఇప్పటికి చాలా మంది ఈ వైరస్ కి బలైపోయారు.
Cronavirus Vaccine : కంటికి కనిపించని కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తుంది.. ఇప్పటికి చాలా మంది ఈ వైరస్ కి బలైపోయారు. మరికొందరు ఈ వ్యాధి సోకి పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది
అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందు నవంబర్ 1 లోగా కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి అమెరికా రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని ట్రంప్ యంత్రాంగం కోరింది. డల్లాస్ కి చెందిన టోకు వ్యాపారి మెక్కెస్సన్ కార్ప్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతులను కోరింది.
"ఈ అనుమతులను పొందటానికి అవసరమైన సాధారణ సమయం.. ఈ అత్యవసర ప్రజారోగ్య కార్యక్రమం విజయవంతం కావడానికి గణనీయమైన అవరోధంగా ఉంది" అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (అమెరికా వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రం) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27 న రాసిన లేఖలో పేర్కొన్నారు.. "ఈ పంపిణీ సౌకర్యాల కోసం దరఖాస్తులను వేగవంతం చేయడంలో మీ సహాయాన్ని సీడీసీ అత్యవసరంగా అభ్యర్థిస్తుంది." అని అయన అందులో వాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నవంబరు నెల ప్రారంభం నుంచే టీకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. మొదట డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం.. ఆ తర్వాత టీకా ఉత్పత్తిని క్రమంగా పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాక్సిన్ విడుదలకు సంబంధించి ప్రణాళిక వివరాలను తెలియజేసే పత్రాలను రాష్ట్రాలకు ఇప్పటికే అందజేసిన సీడీసీ.. అవి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్‌లుగా లేదా అత్యవసర వినియోగ కింద ఆమోదిస్తామని పేర్కొంది. వ్యాక్సిన్ తొలి డోసు వేసిన కొద్ది వారాల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు వెల్లడిచింది.