రష్యాకు మరోసారి షాక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌

Black Sea: నల్ల సముద్రంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2022-05-02 13:00 GMT

రష్యాకు మరోసారి షాక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌

Black Sea: నల్ల సముద్రంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్నేక్‌ ఐలాండ్‌కు సమీపంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న రష్యన్‌ బోట్లను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. మొన్న సరిహద్దులోని రష్యా భూభాగంలోని బ్రియాన్‌స్క్‌లో చమురు డిపోలను ఉక్రెయిన్‌ బలగాలు ధ్వంసం చేశాయి. అంతకుముందు రష్యాకు చెందిన భారీ రక్షణ నౌక్‌ మోస్క్‌వాను ఉక్రెయిన్ కూల్చేసింది. అయితే నౌకలోని మందుగుండు పేలుడుతోనే మోస్క్‌వా ధ్వంసమైనట్టు రష్యా ప్రకటించింది.

నల్లసముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌లోని ఉక్రెయిన్ దళాలను లొంగిపోవాలని రష్యా బలగాలు హెచ్చరిస్తున్నాయి. రష్యా నౌకాదళం ఇప్పటికే స్నేక్‌ ఐలాండ్‌ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా నల్లసముద్రంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న రష్యాకు చెందిన రెండు బోట్లపై ఉక్రెయిన్‌ సైనికులు దాడులు చేశారు. ఈ రెండు సముద్రంలోనే ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఉక్రెయిన్‌ రక్షణ శాఖ విడుదల చేసింది. సుముద్రంలో బోట్లు పేలుతున్నట్టుగా అందులో స్ఫస్టంగా తెలుస్తోంది. ఈ బోట్లలో 20 మందికి పైగా నేవీ సిబ్బంది ఉన్నట్టు ఉక్రెయిన్‌ అంచనా వేసింది. అయితే రెండ్రోజుల క్రితం ఉక్రెయిన్‌ సరిహద్దులోని రష్యా భూభాగం బ్రియాన్‌స్క్‌ ప్రాంతంలోని చమురు డిపోలపై ఉక్రెయిన్‌ సైన్యం దాడి చేసింది. అంతకుముందు నల్లసముద్రంలోని రష్యాకు చెందిన రక్షణ నౌక మోస్క్‌వాను ఉక్రెయిన్ కూల్చేసింది. మోస్క్‌వా ధ్వంసంపై రష్యా స్పందించింది. నౌకలోని మందుగుండు సామగ్రి పేలుడుతోనే ధ్వంసమైనట్టు రష్యా తెలిపింది.


Tags:    

Similar News