యూకేలో మళ్లీ లాక్‌డౌన్‌.. కొత్త రకం వైరస్ విజృంభణతో...

Update: 2020-12-20 04:57 GMT

యూకేలో క్రిస్మస్ వేడుకలకు బ్రేక్ పడింది. కొత్తరకం కరోనా వైరస్ పంజా విసురుతుండటంతో దేశం మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. మూడు రోజులుగా బ్రిటన్ లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతానికి పైగా కొత్త రకం వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు లండన్‌ తో పాటు దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.

నిన్నటి నుంచి లాక్‌డౌన్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో క్రిస్మస్ ఫెస్టివల్ నిర్వహించుకోలేకపోతున్నామని ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని యూకే వైద్యాధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్‌కు గురికావల్సి వస్తోందని హెచ్చరిస్తున్నార. 

Tags:    

Similar News