Planes Accident in Mid-Air : గాల్లో ఢీకొన్న విమానాలు: 8 మంది మృతి

Planes Accident in Mid-Air: అమెరికా ఇడాహోలోని ఒక సరస్సు ప్రదేశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు

Update: 2020-07-06 09:55 GMT

Planes Accident in Mid-Air: అమెరికా ఇడాహోలోని ఒక సరస్సు ప్రదేశంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు అధికారులు. ఈ రెండు విమానాలు ఇడాహోలోని కోయూర్ డి అలీన్ సరస్సుపై ఢీకొని, ఆపై మునిగిపోయాయని సిఎన్‌ఎన్‌లో ఒక నివేదిక తెలిపింది. సరస్సులో మునిగిపోయిన రెండు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. ఇక మిగిలిన ఆరుగురు బాధితులను ఇంకా గుర్తించలేకపోయినప్పటికీ, వారు చనిపోయినట్లు భావిస్తున్నారు అయితే ప్రమాదం భారిన పడిన వారి వివరాలు మాత్రం ఇవ్వలేదు. మరోవైపు విమానంలో కూర్చున్న వ్యక్తుల సంఖ్యను కూడా పరిశోధకులు ఇంకా నిర్ధారించలేదు.

నివేదిక ప్రకారం, విమానాలను నీటి లోతులో చిక్కుకున్నట్లు సోనార్ బృందం గుర్తించింది. ఈ శిధిలాలను బయటికి తీసుకురావడానికి కనీసం ఒకటి లేదా రెండు రోజులు పడుతుందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదం పై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఇయాన్ గ్రెగర్ను సిఎన్ఎన్ తో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన విమానాలలో ఒకటి సెస్నా 206 మోడల్ అని దృవీకరించారు. FAA , జాతీయ రవాణా భద్రతా బోర్డు రెండూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. అనేక మంది ప్రత్యక్ష సాక్షులనుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను దర్యాప్తు బృదాలు సేకరిస్తున్నాయి.


Tags:    

Similar News